Chittoor: చోరీ పేరుతో చితకబాదారు.. పోలీసులపై ఎస్సీ మహిళ ఆరోపణలు

విచారణ పేరిట పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఎస్సీ మహిళ ఆరోపణలు చేయడం చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. చోరీ పేరుతో చితకబాదారని ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Published : 23 Jan 2022 01:53 IST

చిత్తూరు: విచారణ పేరిట పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఎస్సీ మహిళ ఆరోపణలు చేయడం చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. చోరీ పేరుతో చితకబాదారని ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌ ఇంట్లో చోరీ జరిగి రూ.2 లక్షలు పోయాయి. ఉమామహేశ్వరి అనే ఎస్సీ మహిళ సూపరింటెండెంట్‌ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. దీంతో ఆమెపై అనుమానంతో పోలీసులు విచారణ చేశారు. నేరం ఒప్పుకోవాలంటూ తనను చితకబాదారని ఉమామహేశ్వరి ఆరోపించారు. చివరికి నేరం చేయలేదని తెలుసుకొని పోలీసులు రాజీకి వచ్చారని.. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలు తనవి కాదని స్వయంగా పోలీసులే చెప్పారని ఉమామహేశ్వరి తెలిపారు. అంతేకాకుండా తనను పోలీసులు కొట్టినట్లు బయట చెప్పొద్దని బెదిరించారని.. ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని పోలీసులు చెప్పినట్లు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు