YouTube: యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే నగదు.. వెలుగులోకి నయా సైబర్ మోసం!
ప్రస్తుతం చాలా మందికి యూట్యూబ్ (YouTube) ఒక ఆదాయవనరుగా మారిపోయింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) సరికొత్త మోసానికి తెరలేపారు. వారి చెప్పిన మాయమాటలు నమ్మి ఓ వ్యక్తి రూ. 8.5 లక్షల నగదు పోగొట్టుకున్నాడు.
దిల్లీ: ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొత్తదనం కోరుకునే వారికి యూట్యూబ్ (YouTube) వేదికగా ఎన్నో రకాల వీడియోలు, షార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి షార్ట్స్ చూడటం మొదలు పెడితే.. అలా స్వైప్ చేస్తూ ఒకదాని తర్వాత మరొకటి అంటూ చూస్తూనే ఉండిపోతాం. ప్రస్తుతం చాలా మందికి యూట్యూబ్ ఒక ఆదాయవనరుగా మారిపోయింది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) సరికొత్త మోసానికి తెరలేపారు. యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేస్తే నగదు బహుమతి ఇస్తామని అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా గురుగ్రామ్ (Gurgram)కు చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసాగాళ్ల వలలో పడి రూ. 8.5 లక్షల నగదు పోగొట్టుకున్నాడు.
ఏం జరిగిందంటే?
గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే.. ప్రతి లైక్‌కు రూ. 50 చెల్లిస్తామనేది సదరు మెసేజ్ సారాంశం. ఇదో గొప్ప ఆదాయమార్గమని ఆశ చూపించడంతో సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసేందుకు అంగీకరించాడు. తర్వాతి రోజు నందాకు ఓ మహిళ ఫోన్ చేసి యూట్యూబ్‌లో లైక్స్ ఒప్పందంలో భాగంగా వ్యాపారపరమైన నిర్వహణ ఖర్చుల నిమిత్తం కొంత నగదు జమ చేయాలని కోరింది. నగదును ట్రాన్స్‌ఫర్ చేసేందుకు నగదు రిక్వెస్ట్ పంపుతున్నామని చెప్పింది. ఆమె పంపిన రిక్వెస్ట్‌పై క్లిక్ చేసిన తర్వాత విడతల వారీగా రూ. 8.5 లక్షల నగదు తన ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ అయినట్లు నందా గుర్తించాడు. దీనిపై మెసేజ్ పంపిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అవతలి వైపునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు నమోదైన సైబర్ మోసాల్లో ఇది కొత్త తరహా మోసమని పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ వీడియోలతో మాల్‌వేర్ వ్యాప్తి
యూట్యూబ్ ద్వారా మరో సైబర్ మోసం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన వీడియోల ద్వారా మాల్‌వేర్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ట్యుటోరియల్ వీడియోల పేరుతో యూజర్లను ఆకర్షించి.. ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆటోడెస్క్ 3డీఎస్ మ్యాక్స్, ఆటోక్యాడ్ వంటి సాఫ్ట్‌వేర్‌లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో వివరిస్తాం అని డెస్క్రిప్షన్‌లో పేర్కొంటారు. యూజర్లు వీడియోలపై క్లిక్ చేసిన తర్వాత కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. సదరు లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత వారి డివైజ్‌లలోకి మాల్‌వేర్ డౌన్‌లోడ్ అవుతుంది. తర్వాత యూజర్ ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన యాప్‌ల వివరాలు వంటివి సేకరిస్తున్నారని క్లౌడ్‌సెక్ (CloudSEK) అనే సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. యూజర్లు సదరు వీడియోల పట్ల అప్రమత్తతో ఉండాలని హెచ్చరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు