బోయిన్‌పల్లి కేసులో 14మందికి బెయిల్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14మందికి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన

Published : 19 Feb 2021 01:08 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14మందికి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్‌పల్లి ఠాణాలో హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు ఇప్పటికే  బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 21మందిని అరెస్టు చేశారు. వారిలో అఖిలప్రియ సహా 15మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. మరో ఆరుగురు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని