ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తే ‘అలా’ చేయమని కాదు..!

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించినంత మాత్రాన.. అది లైంగిక సంబంధం పెట్టుకోవడానికి, వేధింపులకు గురిచేయడానికి అనుమతి ఇచ్చినట్లు కాదని హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు వెల్లడించింది. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్‌పై కోర్టులో తాజాగా విచారణ జరిగింది. బాధితురాలే

Published : 09 Feb 2021 01:46 IST

సిమ్లా: ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించినంత మాత్రాన.. అది లైంగిక సంబంధం పెట్టుకోవడానికి, వేధింపులకు గురిచేయడానికి అనుమతి ఇచ్చినట్లు కాదని హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్‌పై కోర్టులో తాజాగా విచారణ జరిగింది. బాధితురాలే ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిందని, బాలిక తన వయసు గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించాడు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి .. ‘‘నెటిజన్లు సోషల్‌మీడియాలో తమ గుర్తింపును గోప్యంగా ఉంచడం సహజమే. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ అనేది నిందితుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అనుమతి కాదు’’అని వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. సోషల్ ‌మీడియా వినియోగించడమనేది ఒక సంప్రదాయంగా మారిపోయిందని.. ఇది పరిధిని పెంచుకోవడానికి, జ్ఞానం, వినోదం పొందడానికే గానీ.. మానసిక, లైంగిక వేధింపులకు గురిచేయడానికి కాదని న్యాయమూర్తి హితవు పలికారు.

ఇదీ చదవండి..

సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని