Gold Smuggling: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 7కిలోలకు పైగా బంగారం స్వాధీనం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.

Published : 06 Oct 2022 14:48 IST

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. వారి లగేజీని తనిఖీ చేయగా కడ్డీల రూపంలో అక్రమంగా 7 కిలోలకు పైగా బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. 

స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు మూడున్నర కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని