Updated : 27 Aug 2021 21:41 IST

Kazakhstan: కజకిస్థాన్‌లో భారీ పేలుళ్లు.. 9మంది మృతి

దుషన్బే: కజకిస్థాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దక్షిణ కజకిస్థాన్‌లోని సైనిక ఆయుధాలు నిల్వచేసే గోదాం వద్ద చోటుచేసుకున్న వరుస పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లలో దాదాపు 90 మంది గాయపడినట్టు సమాచారం. దాదాపు ఆరు పేలుళ్లు చోటుచేసుకోవడంతో  పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. కిర్గిజిస్థాన్‌ సరిహద్దులోని తారాజ్‌ నగరం సమీపంలో మిలటరీ యూనిట్‌కు చెందిన గోదాం వద్ద ఈ పేలుళ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో రహదారులను మూసివేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో 1200 మందిని ముందు జాగ్రత్తగా తరలించారు. అయితే, ఈ ఘటనకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని