Updated : 13 Apr 2022 00:31 IST

Brooklyn Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 16 మందికి గాయాలు!

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో 36వ స్ట్రీట్‌ సబ్‌వే స్టేషన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 16 మందికి గాయాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నెత్తురోడుతున్న గాయాలతో బాధితులు స్టేషన్‌లోనే ప్లాట్‌ఫాంపై పడి ఉన్నట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. ఉదయం రద్దీ సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు అలాంటి ఆధారాలు లభ్యం కాలేదని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న వారు.. విచారణ ప్రారంభించారు. బ్రూక్లిన్‌లోని 36వ స్ట్రీట్‌, 4వ అవెన్యూ ప్రాంతంలోకి వెళ్లొద్దని పౌరులకు సూచనలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. దేశంలో తుపాకుల వినియోగంపై కొత్త నియంత్రణ చర్యలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంటున్నా.. అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కాల్పులు జరిపిన దుండుగుడు నిర్మాణ రంగ కార్మికుడి దుస్తులు, గ్యాస్‌ మాస్క్‌ ధరించి ఉన్నట్లు తెలుస్తోందని ఓ వార్తాసంస్థ తెలిపింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని