Crime news: ‘మహా’ దారుణం.. మహిళపై కిరాతక లైంగిక దాడి!
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఘోరం చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళపై అత్యంత కిరాతకంగా లైంగిక దాడి జరిగింది. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం ఆ నరరూప రాక్షసులు బాధితురాలి రహస్య అవయవాలపై రాడ్డుతో దాడి చేసి నడి రోడ్డుపైనే రక్తపు మడుగులో వదిలి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఈ పాశవిక ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని సాకినాక ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో రహదారిపై ఓ మహిళ రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉన్నట్టు తమ ప్రధాన కాల్ సెంటర్‌కు సమాచారం వచ్చినట్టు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకొని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ పాశవిక ఘటనలో మరికొంత మంది ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఏ రోజు జరిగిందనే విషయం మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. మరోవైపు, ఆ ప్రాంత డీసీపీతో పాటు ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
-
World News
China: తైవాన్‌పై అవసరమైతే బలప్రయోగం తప్పదు..!
-
General News
Menstrual Disturbances: నెలసరి చిక్కులెందుకో..? కారణాలు ఇవే..!
-
World News
Cuba: క్యూబా ప్రధాన చమురు నిల్వలో 40శాతం ఆహుతి..!
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
-
India News
Omicron: దిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్..!
- IIT Madrasలో రికార్డుస్థాయి ప్లేస్మెంట్లు..ఓ విద్యార్థికి ₹2కోట్ల వార్షిక వేతనం!
- Rohit sharma: ఈ ఫ్లాన్తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Thief: ‘నన్ను క్షమించు తల్లీ’.. దేవతను వేడుకొని మరీ హుండీ ఎత్తుకెళ్లిన దొంగ
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు