Crime news: 11 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. దుకాణదారుడి అరెస్టు

ఏవైనా వస్తువులు కొనేందుకు వెళ్తే బాలికల్ని లైంగికంగా వేధించిన దుకాణదారుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 20 Jun 2024 22:19 IST

సిమ్లా: పాఠశాలకు వెళ్లే బాలికల పట్ల వికృత చేష్టలకు పాల్పడిన ఓ దుకాణదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం  హిమాచల్‌ప్రదేశ్‌లోని  చౌపాల్‌లో వెలుగు చూసింది. ఏవైనా వస్తువులు కొనేందుకు దుకాణానికి వెళ్తే తమ పట్ల అనుచితంగా ప్రవర్తించడం, తాకరానిచోట తాకి వేధించేవాడని ఆ బాలికలు పాఠశాల సిబ్బంది వద్ద వాపోయారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

ప్రియుడితో కలిసి ఘాతుకం.. భర్తను కాల్చిచంపమన్న భార్య

దీంతో నిందితుడు సత్య ప్రకాశ్‌పై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తొలుత పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలియడంతో అతడు చౌపాల్ నుంచి పారిపోగా..  ఘనహట్టిలో  పట్టుకున్నట్లు ఎస్పీ సంజీవ్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. గతంలో నిందితుడు ఓ హత్య కేసులో దోషి అని, క్రిమినల్‌ రికార్డు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు, బాలికలపై లైంగిక వేధింపుల అంశంపై భాజపా నేతలు తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణ అంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని