
Updated : 23 Aug 2021 04:22 IST
TS news: మరణించిన అన్నకు రాఖీ కట్టారు
నల్గొండ: రాఖీ పండుగ రోజున ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రాఖీ కట్టేందుకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. కానీ, ఆ ఆన్న రాత్రికి రాత్రే కన్ను మూశాడు. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం చింతపల్లికి చెందిన లక్ష్మయ్యకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు. రాఖీ కట్టేందుకు నిన్న సాయంత్రం సోదరుడి ఇంటికి చేరుకున్నారు. రాత్రి సమయంలో లక్ష్మయ్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటనతో రాఖీ కట్టడానికి వచ్చిన సోదరీమణులు కన్నీరుమున్నీరయ్యారు. తమ సోదరుడికి చివరి సారి రాఖీలు కట్టి వీడ్కోలు పలికారు. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
ఇవీ చదవండి
Tags :