Remdesivir: అక్రమంగా విక్రయం..అరెస్టు 

గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమంగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 02 May 2021 01:37 IST

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో అక్రమంగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు ఇంజెక్షన్లు, రూ.2.40లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెనాలిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వ్యక్తుల ద్వారా ఇంజెక్షన్లను బాధితులకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించామని డీఎస్పీ స్రవంతిరాయ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి వీటిని తెప్పించి ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.40 వేలకు విక్రయిస్తున్నారని చెప్పారు. డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు