Uttar Pradesh: 24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్‌ తలుపులు.. అందులో భయానక దృశ్యాలు

పనిచేయకుండా పోయిన లిఫ్ట్‌ను దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తెరిచిన సిబ్బంది అందులోని దృశ్యాలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు.....

Updated : 07 Sep 2021 05:16 IST

లఖ్‌నవూ: పనిచేయకుండా పోయిన లిఫ్ట్‌ను దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తెరిచిన సిబ్బంది అందులోని దృశ్యాలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌ కైలీలోని ఈపీసీఈ ఆసుపత్రిని 1991లో నిర్మించారు. అందులోని లిఫ్ట్‌ కొద్దికాలంపాటు పనిచేసి 1997లో పాడైపోయింది. అప్పటి నుంచి ఆ లిఫ్ట్‌ వినియోగంలో లేదు. తాజాగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన ఆసుపత్రి యాజమాన్యం ఆ లిఫ్ట్‌ను తెరిపించింది. అయితే అందులో పూర్తిగా ధ్వంసమైపోయిన ఓ అస్థిపంజరం బయటపడటం కలకలం రేపింది.

విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు ఎముకలను డీఎన్‌ఏ పరీక్షల కోసం తరలించారు. అనంతరం ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. పనిచేయకుండాపోయిన లిఫ్ట్‌లోకి మృతదేహం ఎలా వచ్చింది? లిఫ్ట్‌ ఆగిపోయిన సమయంలో ఆ వ్యక్తి అందులోనే ఉండిపోయాడా? లేదా ఎవరైనా అతడిని హత్య చేసి అందులో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడిని గుర్తించేందుకు 24 ఏళ్ల క్రితం తప్పిపోయినవారి సమాచారం సేకరిస్తున్నారు. డీఎన్‌ఏ నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు