Andhra News: 45 రోజుల్లో 6 సార్లు పాము కాటు

పాము పేరు వింటేనే ఆ కుటుంబం వణుకుతోంది. 45 రోజుల వ్యవధిలో నలుగురు కుటుంబ సభ్యులను ఆరుసార్లు పాము కాటేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ

Updated : 14 Mar 2022 06:46 IST

కుటుంబాన్ని వెంటాడుతున్న సమస్య

చంద్రగిరి, న్యూస్‌టుడే: పాము పేరు వింటేనే ఆ కుటుంబం వణుకుతోంది. 45 రోజుల వ్యవధిలో నలుగురు కుటుంబ సభ్యులను ఆరుసార్లు పాము కాటేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆదిఆంధ్రవాడకు చెందిన ఓ కుటుంబాన్ని పాము పీడకలలా వెంటాడుతోంది. వెంకటేష్‌ తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్‌, తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీ ప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి జగదీష్‌ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అతడి కాలుపై పాము కాటువేసింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గతంలో వెంకటేష్‌ రెండుసార్లు, ఆయన తండ్రి, భార్య, కుమారుడు ఒక్కోసారి పాము కాటుకు గురయ్యారు. తాజాగా కుమారుడు జగదీష్‌ను మరోసారి పాము కాటు వేసింది. బాధిత కుటుంబ సభ్యులు మరోచోటికి వెళ్లడానికి అంగీకరించడం లేదు. పాము బెడద నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని