Hyderabad: పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్ షిప్‌లో వెలుగు చూసింది.
నార్సింగి: పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. నార్సింగి అడ్మిన్ ఎస్సై బాలరాజు కథనం ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన వినోద్ కుమార్ (32) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గుంటూరు నుంచి పని చేసిన ఆయన.. ఆఫీస్‌కు వెళ్లాల్సి రావటంతో ఇటీవల అల్కాపూర్‌లోని సోదరుడి ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు.
ఉద్యోగ నిర్వహణకు కొత్త టూల్స్ వస్తుండటంతో వాటిపై పట్టు సాధించలేకపోయిన వినోద్.. ఆ విషయంపై తరచూ సోదరుడితో చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవటంతో గురువారం సోదరుడు, అతని భార్య బయటకు వెళ్లగా ఒంటరిగా ఉన్న వినోద్ కుమార్ బెడ్‌షీట్‌తో ఉరి వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వెంటనే వినోద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video:గగనతలంలో అధ్యక్షుడి విమానం డేంజరస్ స్టంట్..!
-
India News
దేశ విభజన కారకులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదు: డీయూ
-
Politics News
విభేదాలు పక్కన పెట్టండి.. విపక్షాలకు కమల్ హాసన్ పిలుపు
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ సినిమా తరహాలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో భారీ చోరీ
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IPL 2023 Final: ‘నేను గుజరాత్ బిడ్డను.. అయినా నా మనసు చెన్నై గెలవాలనుకుంటోంది’