Hyderabad: అత్త గొంతుకోసి, మామ తల పగులగొట్టి అల్లుడు పరార్
బోడుప్పల్ అన్నపూర్ణ కాలనీలో దారుణం జరిగింది. వృద్ధదంపతులైన అత్త మామలపై అల్లుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.

హైదరాబాద్: బోడుప్పల్ అన్నపూర్ణ కాలనీలో దారుణం జరిగింది. వృద్ధదంపతులైన అత్త మామలపై అల్లుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ వీధి నెంబరు 6లో నివాసముంటున్న సూర్య, రుక్ష్మిణి దంపతులు వారి నివాసంలో ఉండగా.. అల్లుడు అనిల్ కుమార్ కత్తితో దాడి చేశాడు. అత్త గొంతుకోసి, మామ తల పగులగొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కాలనీ వాసులు 108కి సమాచారం ఇచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దంపతుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.