మితిమీరిన వేగంతో చిన్నారిని ఢీకొట్టి పరారీ

నిబంధనలు ఉల్లంఘించి మితిమీరిన వేగంతో వాహనం నడపడం ఓ చిన్నారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఎస్‌ఆర్‌నగర్‌ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ప్రాంతంలో....

Published : 08 Feb 2021 01:47 IST

 

హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘించి మితిమీరిన వేగంతో వాహనం నడపడం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గత నెల 24న హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ప్రాంతంలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో వెళుతోంది. ఈ క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం చిన్నారి పైకి దూసుకెళ్లింది. రోడ్డు దాటుతున్న పాపను వేగంగా ఢీకొట్టిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై ముగ్గురు ఉండటంతోపాటు మితిమీరిన వేగంతో నిబంధనలు అతిక్రమించి ప్రమాదానికి కారణమయ్యారు. చిన్నారిని ఢీకొట్టిన వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. ఎట్టకేలకు సీసీ కెమెరాలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి...

కోఠిలో భారీ అగ్ని ప్రమాదం

బెడిసికొట్టిన ‘వయాగ్రా’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని