విద్యార్థి ప్రాణం తీసిన వీడియో గేమ్‌

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న ఓ బాలుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది

Updated : 27 Jun 2021 09:32 IST

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న ఓ బాలుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగీత్‌ నగర్‌లో నివసించే ఆనంద్‌, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

వీరిలో మణికంఠ (12) ఓ ప్రైవేటు పాఠశాలలో  8వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు, అన్నయ్య ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నాడు. ఈరోజు ఇంట్లో ఎవరూలేని సమయంలో మణికంఠ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. మృతికిగల కారణాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ వద్ద ఉన్న మొబైల్‌లో వీడియోగేమ్‌ ఓపెన్‌ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీడియోగేమ్‌లు చూస్తూ .. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని