Crime News: ఈవ్‌టీజింగ్ చేసి.. ఆపై ఆందోళన చెంది..
ఇంట్లో ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య
పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: ఓ బాలుడు తరగతి గదిలో తోటి విద్యార్థినులను వేధించాడు. టీచర్లు, తల్లిదండ్రులు మందలించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పహాడీషరీఫ్ ఎస్సై మధు కథనం ప్రకారం... జల్పల్లి పురపాలికలోని ఓ కాలనీలో నివసించే బాలుడు(13) రాజేంద్రనగర్ సర్కిల్లోని ఓ బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతిగదిలో ఇద్దరు విద్యార్థులతో కబుర్లు చెప్పసాగాడు. విద్యార్థినుల పుస్తకాలు తీసుకుని వారి గురించి అసభ్య పదజాలం రాశాడు. వారు ఫిర్యాదు చేయడంతో టీచర్ ముగ్గురు బాలురనూ మందలించారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకూ ఫోన్లో చెప్పారు. అసభ్యవ్యాఖ్యలు రాసిన బాలుడి తండ్రి అతడిని ఫోన్లోనే మందలించారు. బాలుడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఇంతలో మిలిటరీలో ఉన్న మేనమామ బాలుడితో ఫోన్లో మాట్లాడి తల్లిదండ్రులను క్షమాపణలు కోరాలని సూచించారు. ఈ పరిణామాలతో కలత చెందిన బాలుడు ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. పోరాడి ఓడిన భారత్
-
General News
Parrot: ‘ఆ చిలుక నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది’.. పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
-
World News
Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
- Nithiin: అభిమానుల కోసం మరో 20 ఏళ్లైనా కష్టపడతా: నితిన్