Crime News: పోటీ పడి మాత్రలు మింగిన విద్యార్థినులు.. ప్రాణం తీసిన పందెం

మోతాదుకు మించి విటమిన్‌ మాత్రలు మింగిన ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం మేరకు... నీలగిరి జిల్లా ఉదగై సమీప కందల్‌ ప్రాంతంలోని మున్సిపల్‌ మాధ్యమిక పాఠశాలలో పోషకాహార విభాగం తరఫున విద్యార్థులకు ఇటీవల విటమిన్‌ మాత్రలు పంపిణీ చేశారు.

Updated : 11 Mar 2023 08:24 IST

ఒకరి మృతి.. మరో ముగ్గురికి అస్వస్థత

చెన్నై (ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: మోతాదుకు మించి విటమిన్‌ మాత్రలు మింగిన ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం మేరకు... నీలగిరి జిల్లా ఉదగై సమీప కందల్‌ ప్రాంతంలోని మున్సిపల్‌ మాధ్యమిక పాఠశాలలో పోషకాహార విభాగం తరఫున విద్యార్థులకు ఇటీవల విటమిన్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఎవరు ఎక్కువ మాత్రలు మింగుతారోనని పందెం వేసుకున్నారు. ఓ విద్యార్థిని 45, మిగిలిన ముగ్గురు 30 మాత్రల చొప్పున మింగారు. మోతాదుకు మించి వేసుకోవడంతో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఉదగై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కోయంబత్తూర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. 45 మాత్రలు మింగిన విద్యార్థిని ఉదగైకు చెందిన సలీమ్‌ కుమార్తె జైబా ఫాతిమా మూత్రపిండాలు దెబ్బతిని గురువారం చనిపోయారు. మరో ముగ్గురికి పాక్షికంగా మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. అధిక మొత్తంలో మాత్రలు వారికెలా వచ్చాయన్న విషయంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుడు మొహ్మద్‌ అమీన్‌, ఉపాధ్యాయురాలు కలైవాణిని సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని