Published : 29 Jan 2022 01:57 IST

Crime News : సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం!

గతంలో భార్య ఆత్మహత్యనూ వీడియోలో చిత్రీకరించిన వైనం

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన పెంచలయ్య అనే వ్యక్తి భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇదంతా సెల్ఫీవీడియో తీసుకుని వాట్సాప్‌లో షేర్‌ చేయడంతో సంచలనంగా మారింది. గతంలో అతడి భార్య ఆత్మహత్య చేసుకుంటుండగానే పెంచలయ్య వీడియో తీయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు పనిచేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక పెంచలయ్య భార్య కొండయ్య గతేడాది సెప్టెంబర్‌ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య తన భార్య చావుకు, తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాయడం గమనార్హం. ఇవే విషయాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లోకి పంపించాడు. అనంతరం పురుగులమందు తాగడంతో సృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని వైద్యం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నెల్లూరు తరలించారు. ప్రస్తుతం పెంచలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని