వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్‌ యాదవ్‌ అరెస్ట్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో అరెస్ట్‌ చేసినట్లు

Updated : 03 Aug 2021 13:15 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. గోవాలో సోమవారం అరెస్ట్‌ చేసిన అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌లో కడప తీసుకొచ్చారు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

కీలక వ్యక్తులను విచారిస్తున్న సీబీఐ
మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన సునీల్‌ యాదవ్‌తో పాటు వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌తో పాటు మరొకరిని విచారిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని