Raghurama: కానిస్టేబుల్‌పై దాడి... ఎంపీ రఘురామ భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద జరిగిన రెక్కీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని

Published : 06 Jul 2022 01:48 IST

హైదరాబాద్‌: వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద జరిగిన రెక్కీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురామతో పాటు ఆయన భద్రతా సిబ్బంది చెబుతుండగా.. రోడ్డు పక్కన ఉన్న తనను కారులో బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభారీ చెబుతున్నారు. ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. 
రోడ్డుపక్కన ఉన్న కానిస్టేబుల్‌ సుభానీని రఘురామ భద్రతా సిబ్బంది బలవంతంగా కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  దీనిపై స్పందించిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకు భద్రతగా ఉన్న సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ గంగారామ్‌తోపాటు కానిస్టేబుల్ సందీప్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్‌, సీర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ గంగారామ్‌, రఘురామ పీఏ శాస్త్రిలపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని