Khammam: ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత

నగరంలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ విద్యార్థిని పల్లవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Published : 24 Sep 2023 22:16 IST

ఖమ్మం విద్యావిభాగం: నగరంలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ విద్యార్థిని పల్లవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  ఆదివారం ఉదయం కాలేజీలో ప్రత్యేక తరగతులకు హాజరైన పల్లవి తీవ్ర అస్వస్థతతకు గురైంది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పల్లవి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని