Andhra News: సీఎం జగన్‌ పీఏ పేరుతో మణిపాల్‌ ఆస్పత్రి ఎండీకి ఫేక్‌ మెసేజ్‌

ఏపీ సీఎం జగన్‌ పీఏ పేరుతో బెంగళూరులో మణిపాల్‌ ఆస్పత్రి ఎండీకి ఫేక్‌ మెసేజ్‌ పంపిన వ్యక్తిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఓ క్రికెటర్‌కి ఇంటర్నేషనల్‌

Published : 01 Jul 2022 01:51 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ పీఏ పేరుతో బెంగళూరులో మణిపాల్‌ ఆస్పత్రి ఎండీకి ఫేక్‌ మెసేజ్‌ పంపిన వ్యక్తిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఓ క్రికెటర్‌కి ఇంటర్నేషనల్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కిట్లు స్పాన్సర్‌ చేయాలి. వాటి విలువ రూ.10,40,400 ఉంటుంది. కిట్‌పై మణిపాల్‌ చిహ్నాన్ని వాడుకుంటాం’’ అంటూ సీఎం పీఏ పేరుతో ఆ ఆస్పత్రి వెబ్‌సైట్‌ ఎండీకి గుర్తుతెలియని వ్యక్తి మెసేజ్‌ చేశాడు. 

ఆ మెసేజ్‌ ఎంతవరకు వాస్తవమో పరిశీలించాలని తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రి అసోసియేట్‌ డైరెక్టర్‌ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఎండీ సూచించారు. వచ్చింది ఫేక్‌ మెసేజ్‌గా ఆయన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఇదే విధంగా పలువురిని మోసగించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని