Khammam: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురి అరెస్టు?

తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసుల

Published : 18 Aug 2022 11:24 IST

ఖమ్మం: తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న 8 మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఏ2గా రంజాన్‌, గంజి స్వామి (ఏ4), నూకల లింగయ్య (ఏ5), బోడపట్ల శ్రీను (ఏ6), నాగేశ్వరరావు (ఏ7), నాగయ్య (ఏ8)గా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి పోలీసుల పహారాలో ఉంది. గ్రామంలోని కూడళ్లలో పోలీసులు బృందాలుగా ఏర్పడి పహారా కాస్తున్నారు. 12 చోట్ల మొత్తం 92 మంది పోలీసులు పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు. 12 మంది ఎస్‌ఐలు, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో పికెటింగ్‌ కొనసాగుతోంది. మండల వ్యాప్తంగా ఈనెల 18వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ ప్రకటించారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య హత్య నేపథ్యంలో కృష్ణయ్య అనుచరులు, గ్రామస్థులు గ్రామంలోని తమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరి ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిపై నిఘా పెట్టారు. గ్రామస్థులు, ముఖ్యంగా కృష్ణయ్య అనుచరుల కదలికలపై పోలీసులు ఎప్పటికపుడు ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని