Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

మహారాష్ట్రలోని డోంబివలీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులుగా నటిస్తూ.. ఇద్దరు వ్యక్తులు ఓ 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Published : 28 Jan 2023 23:15 IST

ముంబయి: పోలీసులుగా నటిస్తూ.. ఇద్దరు వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఇది. మహారాష్ట్రలోని ఠాణె(thane) జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ 17 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి కళ్యాణ్‌లోని డోంబివలీ(Dombivli) ప్రాంతానికి షికారుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు చేరుకుని, తమను తాము పోలీసులుగా నమ్మించారు. ఈ ప్రాంతంలో తిరగొద్దంటూ హెచ్చరించారు.

ఈ క్రమంలోనే యువకుడిపై దాడి చేసి, ఆమెను బలవంతంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా వీడియో తీసి, ఎవరికైనా చెబితే దీన్ని వైరల్‌ చేస్తామని బెదిరించారు. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టంతోసహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు ముమ్మరం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని