Ts news: తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ అరెస్టు

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అరెస్టయ్యారు.

Published : 06 Oct 2021 01:27 IST


హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అరెస్టయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తెలుగు అకాడమీకి చెందిన ఉద్యోగితో పాటు మరో ముగ్గురు ఉన్నారు. వీరిని రేపు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ .. నిధుల గోల్‌మాల్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిధులు బ్యాంకుల నుంచి మళ్లిస్తు్న్నా.. అకౌంట్స్‌ అధికారిగా మీరు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అని పోలీసులు రమేష్‌ ను ప్రశ్నించినట్టు సమాచారం. కోర్టు అనుమతితో రేపటి నుంచి యూబీఐ బ్యాంకు మేనేజర్‌ మస్తాన్‌వలీని పోలీసులు కస్టడీలో తీసుకొని నిధుల స్వాహా కేసులో లోతుగా విచారించనున్నారు. ఇతర నిందితుల పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు రేపు నిర్ణయం తీసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని