Khammam: చేపల పెట్టెల్లో రూ.8 కోట్ల విలువైన గంజాయి 

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తంగా రూ.8 కోట్లకు పైగా విలువైన 4,483 కిలోల గంజాయిని పోలీసులు

Updated : 29 Jul 2021 10:52 IST

భద్రాద్రి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తం రూ.8 కోట్లకు పైగా విలువైన 4,483 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో రూ.7.30 కోట్లు, ఖమ్మం గ్రామీణ పరిధిలో రూ.1.98 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి పరిధిలోని విద్యానగర్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన రెండు లారీలను పోలీసులు తనిఖీ చేశారు. రెండు లారీల్లోనూ చేపల పెట్టెల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. రెండు లారీల్లో కలిపి మొత్తంగా 3,653 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చింతూరు నుంచి హైదరాబాద్‌ మీదుగా హరియాణాకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ వెల్లడించారు. మరోవైపు ఖమ్మం గ్రామీణం పరిధిలోనూ రూ.1.98 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని