Ts News: నకిలీ పత్రాలతో ఐఓబీకి టోకరా

నకిలీ పత్రాలతో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ)కు టోకరా వేశారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద నకిలీ పత్రాలు సృష్టించి రూ.1.39 కోట్లు

Updated : 15 Jul 2021 16:04 IST

హైదరాబాద్‌: నకిలీ పత్రాలతో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ)కు టోకరా వేశారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద నకిలీ పత్రాలు సృష్టించి రూ.1.39 కోట్లు రుణాలు తీసుకున్న నిందితులను హైదరాబాద్ సీసీస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ పథకం పేరిట ఐఓబీలో నకిలీ ఇన్‌వాయిస్‌లు, అగ్రిమెంట్లు సృష్టించి 8 మంది రుణాలు తీసుకున్నారు. దీనిపై ఐఓబీ చీఫ్ రీజినల్ మేనేజర్ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యా్ప్తు మొదలుపెట్టారు. ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా హైదరాబాద్‌కి చెందిన కీలక సూత్రధారి శ్రీనివాస్ నాయక్‌తో పాటు మరో వ్యక్తి రవిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని