Crime News: అమాయకులకు వల.. 10మంది సైబర్‌ కేటుగాళ్ల అరెస్టు 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 10 మంది నిందితులను రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కస్టమర్‌ కేర్‌ నెంబర్లు, కేవైసీ,

Updated : 12 Oct 2021 06:22 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 10 మంది నిందితులను రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కస్టమర్‌ కేర్‌ నెంబర్లు, కేవైసీ, ఓటీపీ, యూపీఐ, ఫ్రాడ్‌ లింకులు, సిమ్‌ కార్డు, ఈ-కామర్స్‌, నకిలీ వెబ్‌సైట్లు వంటి పలు రకాల నేరాలతో అమాయక ప్రజల ఖాతాల నుంచి నగదు కాజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఝార్ఖండ్‌లోని డియోగర్‌ జిల్లాకు చెందిన వీరంతా సాంకేతికత సాయంతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలో నమోదైన కేసుల వివరాలతో ఝార్ఖండ్ వెళ్లిన ప్రత్యేక బృందం ఈ నిందితులను అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని