AP News: మేకల ఆహారం కోసం చెట్టెక్కి.. విద్యుదాఘాతంతో 11 ఏళ్ల బాలుడి మృతి

పదకొండేళ్ల పసిప్రాయం.. ఆడుకునే వయసు.. తండ్రికి చేతనైనంత సాయం చేద్దామని.. మేకలకు ఆహారం కోసం ఆకులను కోసేందుకు చెట్టెక్కాడా బాలుడు. విధి వక్రించి.. విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. ఈ దయనీయ ఘటన

Updated : 25 Aug 2021 08:35 IST

కోటపాడు(రంగంపేట), న్యూస్‌టుడే: పదకొండేళ్ల పసిప్రాయం.. ఆడుకునే వయసు.. తండ్రికి చేతనైనంత సాయం చేద్దామని.. మేకలకు ఆహారం కోసం ఆకులను కోసేందుకు చెట్టెక్కాడా బాలుడు. విధి వక్రించి.. విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. ఈ దయనీయ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) చెట్టెక్కి ఆకులు కోస్తుండగా పట్టుతప్పి పక్కనే ఉన్న విద్యుత్తు తీగపై పడిపోయాడు. ఈక్రమంలో విద్యుదాఘాతానికి గురై శరీరం కాలి చనిపోయాడు. తీగపై వేలాడుతున్న మృతదేహాన్ని చూసి తండ్రి ముసలయ్యతోపాటు స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి అతికష్టం మీద మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని