
Mysuru Gang Rape: సామూహిక అత్యాచార ఘటన.. అదుపులోకి ఐదుగురు నిందితులు..
నిందితులు తమిళనాడు కూలీలు: కర్ణాటక డీజీపీ
బెంగళూరు: భారీ జనాగ్రహానికి దారి తీసిన మైసూరు సామూహిక అత్యాచర ఘటనలో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఈ విషయాన్ని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసును పోలీసులు ఛేదించినట్టు హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర తెలిపారు.
తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తులు తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన రోజుకూలీలని సూద్ వెల్లడించారు. వారిలో ఒకరికి 18 ఏళ్లలోపు వయస్సున్నట్లు తెలుస్తోందన్నారు. అతడి వయస్సును ధ్రువీకరించుకుంటున్నామని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆగస్టు 24న మైసూర్ నగర శివారుల్లో ఎంబీఏ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె వెంటే ఉన్న స్నేహితుడిపై దుండగులు దాడిచేశారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలు షాక్లో ఉండటంతో, ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించలేకపోతున్నారని హోంమంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.