TS News: విక్స్‌ డబ్బా మింగి ఊపిరాడక చిన్నారి మృతి

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Published : 22 Sep 2021 02:14 IST

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విక్స్‌ డబ్బా మింగి ఊపిరాడక ఓ పసికందు మృతి చెందాడు. ఈ ఉదయం ఏడు నెలల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ విక్స్ డబ్బాను నోట్లో పెట్టుకొని మింగేశాడు. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగానే మార్గం మధ్యలో మృతిచెందాదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని