
Updated : 22 Sep 2021 12:19 IST
AP News: మద్యం బిల్లు రూ.300 ఇవ్వాలని దాడి.. వ్యక్తి మృతి
నరసరావుపేట క్రైం: మద్యం తాగి బిల్లు చెల్లించే విషయంలో తలెత్తిన వివాదంలో దాడి జరగ్గా ఒక వ్యక్తి మృతి చెందాడు. నరసరావుపేట రెండో పట్టణ సీఐ వెంకట్రావు కథనం ప్రకారం... పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పొందుగల వెంకటేశ్వరరెడ్డి, మేకల వెంకట కోటిరెడ్డి ఇద్దరూ స్టేషన్ రోడ్డులోని ఒక గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు పట్టణంలోని ఓ బార్‌కు వెళ్లారు. మద్యం బిల్లు రూ.600 అవడంతో వెంకటకోటిరెడ్డి రూ.300 వెంకటేశ్వరరెడ్డిని(46) అడగడంతో నా వద్ద లేవన్నాడు. దీంతో ఆగ్రహం చెందిన వెంకటకోటిరెడ్డి రాయితో అతని తలపై కొట్టాడు. తీవ్రగాయమైన వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు.
Tags :