
Arrest: చింతలపూడి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ.. ప్రచారం చేసిన వ్యక్తి అరెస్టు
చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ యూట్యూబ్ ఛానల్‌లో ప్రచారం చేసిన కొండేటి కిరణ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన కిరణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అభిప్రాయాలు సేకరించేందుకు గత నెలలో చింతలపూడిలో పర్యటించారు. ఎమ్మెల్యే కనిపించడం లేదని, నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో ఆగస్టు 5న పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు ఆగస్టు 16న చింతలపూడి పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. స్టేషను బెయిల్‌పై విడుదల చేయాలని న్యాయమూర్తి సూచించారు. మంగళవారం ఆయనను విడుదల చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.