TS News: చెరువులో తేలిన చిరుత కళేబరం

చెరువు నీటిలో చిరుత కళేబరం తేలడం మండలంలోని ఖాజాపూరు గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారుల్లో విస్మయం కలిగించింది.

Updated : 29 Feb 2024 15:03 IST

చనిపోయి పడి ఉండటంపై పలు అనుమానాలు


పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: చెరువు నీటిలో చిరుత కళేబరం తేలడం మండలంలోని ఖాజాపూరు గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారుల్లో విస్మయం కలిగించింది. మంగళవారం జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూరు గ్రామ శివారులోని ఉన్న పటేల్‌ చెరువులో చిరుత కళేబరం తేలి ఉండటాన్ని గమనించిన రైతులు, గ్రామస్థులు విషయాన్ని సర్పంచి నాగమణి దృష్టికి తీసుకురాగా వెంటనే సిబ్బందితో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చిరుత దేహంపై ఎలాంటి గాయాలు లేవని, విషాహారం తినడం వల్లే చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదే విధంగా శరీరంపై ముళ్ల పంది ముళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. స్థానిక పశు వైద్యాధికారి గీతామాలిక శవపరీక్ష నిర్వహించిన అనంతరం అక్కడే దహనం చేశారు. అటవీ శాఖ అధికారి నజియా తబుసుం, సిబ్బంది కృష్ణా గౌడ్‌, గబ్బర్‌సింగ్‌ ఉన్నారు. ఏడాది కాలంగా మండల పరిధిలోని కామారం, మీర్జాపల్లి, కామారం తండా, చేగుంట మండలం వల్లూరు అటవీ ప్రాంతాల్లో నాలుగు చిరుతపులులు సంచరిస్తుండగా ఖాజాపూర్‌, చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా తిరిగినట్లు ఆనవాళ్లు లేవు. తాజాగా చిరుత ఖాజాపూర్‌ చెరువులో చనిపోయి పడి ఉండటంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని