
TS News: దొంగతనం నింద మోపారు.. చెప్పుతో కొట్టారు
తెరాస నేతపై మంత్రి కేటీఆర్‌కు మహిళ ఫిర్యాదు
కుప్పకూలిన బాధితురాలు.. ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతున్న హసీనా
సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: తెరాస నాయకుడు తనపై దొంగతనం నిందమోపి అవమానించారంటూ ఓ మహిళ మంత్రి కేటీఆర్ వద్ద వాపోవడం, అక్కడే కుప్పకూలడం కలకలం సృష్టించింది. శనివారం కేటీఆర్ సిరిసిల్లలో కేడీసీసీ బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్ హసీనా అనే మహిళ ఆయన ముందుకెళ్లి..తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తాను స్థానిక తెరాస నేత ఇంట్లో పనిచేస్తున్నానని, ఆయన తనపై దొంగతనం నిందమోపడంతోపాటు చెప్పుతో కొట్టాడని, భౌతికదాడికీ పాల్పడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు. మాట్లాడుతుండగానే పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె తాను హెయిర్‌డై తాగినట్టు వారితో చెప్పి కుప్పకూలిపోయారు. పోలీసులు మంత్రికి సమాచారం ఇవ్వడంతో ఆయన పార్టీ నాయకుల వాహనంలో బాధితురాలిని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ..తనకు జరిగిన అన్యాయంపై హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదుచేశానని, జరిగిన అవమానాన్ని భరించలేకనే హెయిర్ డై తాగానన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.