Suicide: పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం

కుటుంబ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన కోలారు పట్టణంలో సోమవారం చోటుచేసుకున్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు మంగళవారం ధ్రువీకరించారు. మృతులను మునియప్ప (75), నారాయణమ్మ

Published : 10 Nov 2021 10:14 IST

బెంగళూరు ఎలక్ట్రానిక్‌సిటీ, న్యూస్‌టుడే : కుటుంబ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన కోలారు పట్టణంలో సోమవారం చోటుచేసుకున్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు మంగళవారం ధ్రువీకరించారు. మృతులను మునియప్ప (75), నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17), పుష్ప (33)గా గుర్తించారు. విషం తాగిన వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నలుగురు ఆసుపత్రిలో మృతి చెందారు. పుష్పను మరో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమె కూడా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వివరాల్లోకెళ్తే... మునియప్ప కుమార్తె పుష్పకు మరో కుటుంబానికి చెందిన యువతి 20 రోజుల కిందట ఓ చిన్నారిని ఇచ్చి తాను అత్యవసరంగా వేరే గ్రామానికి వెళ్లాల్సి ఉన్నందున కాస్తా చూసుకోవాలని కోరింది. అందుకు పుష్ప అంగీకరించి పాపను స్వీకరించింది. పొరుగూరి నుంచి వచ్చిన తరువాత తన పాపను ఇవ్వాల్సిందిగా ఆ యువతి కోరగా.. తనకు ఎవ్వరినీ ఇవ్వలేదంటూ పుష్ప బుకాయించిందట. దీంతో బాధిత యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన స్థానిక గల్‌పేట పోలీసులు మునియప్ప, ఆయన కుటుంబ సభ్యులను ఈ విషయమై వాకబు చేశారు. తమ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగారు. పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తొలుత నలుగురు మృతి చెందారు. అనంతరం మునియప్ప కుమార్తె పుష్ప కూడా మరణించినట్లు తెలిపారు. గల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని