Cyber Crime: క్రిప్టో కరెన్సీ పేరిట రూ.లక్షల్లో మోసాలు.. ముఠా అరెస్టు

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ముఠాలోని ముగ్గురి సభ్యులను

Updated : 06 Nov 2021 11:50 IST

హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ముఠాలోని ముగ్గురు సభ్యులను రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితుల ఖాతాల్లోని రూ.50లక్షలను నిలుపుదల చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి చెక్‌బుక్‌లు, ఆరు ఏటీఎం కార్డులు, ఆరు సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ సిలిగురికి చెందిన బ్యాంకు ఉద్యోగితో కలిసి ముఠాలోని చోటా భాయ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కమీషన్‌ పేరుతో 64 బ్యాంకు ఖాతాలను ముఠా సేకరించినట్లు వివరించారు. అధిక మొత్తం డబ్బు వస్తుందంటూ షెల్‌ కంపెనీల ఏర్పాటు చేసి నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ముఠా 14 షెల్‌ కంపెనీలతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు సేకరించినట్లు విచారణలో తేలింది. నాంపల్లికి చెందిన వ్యక్తికి రూ.86లక్షల టోకరా వేసినట్లు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని