Suicide: నృత్యం నేర్చుకునేందుకు ఇష్టం లేక బలవన్మరణం

నృత్య తరగతులకు వెళ్లడం ఇష్టం లేని కారణంగానే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు నాలుగోపట్టణ పోలీసులు పేర్కొన్నారు. దొండపర్తిలో సోమవారం రాత్రి బాలిక బలవన్మరణానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం విదితమే.

Updated : 20 Oct 2021 09:29 IST

బాలిక మృతిపై పోలీసుల దర్యాప్తు

గురుద్వారా(విశాఖ), న్యూస్‌టుడే: నృత్య తరగతులకు వెళ్లడం ఇష్టం లేని కారణంగానే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు నాలుగోపట్టణ పోలీసులు పేర్కొన్నారు. దొండపర్తిలో సోమవారం రాత్రి బాలిక బలవన్మరణానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం విదితమే. దర్యాప్తులో భాగంగా బాలిక చదివే పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసించే విధానంపై, ఇంట్లో ప్రవర్తనపై ఆరా తీశారు. ఈమె గతంలో ఓ నృత్యాలయంలో కూచిపూడి నేర్చుకునేది. ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల మాటపై గౌరవంతో బలవంతంగా వెళ్తుండేది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేది. మంగళవారం నుంచి నృత్య తరగతులు మళ్లీ ప్రారంభం కానున్నాయని తెలుసుకొని వెళ్లడం ఇష్టంలేక మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని