Crime News: నవవధువు హత్యకు ప్రణాళిక..అంతర్జాలంలో ‘మడత చాకు’ కొనుగోలు

నవ వధువును భర్త హత్య చేసిన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో 28 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సుధారాణిని ఆమె భర్త కిరణ్‌కుమార్‌

Updated : 28 Sep 2021 06:59 IST

నిజాంపేట, న్యూస్‌టుడే: నవ వధువును భర్త హత్య చేసిన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో 28 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సుధారాణిని ఆమె భర్త కిరణ్‌కుమార్‌ గొంతు కోసి అంతమొందించిన సంగతి తెలిసిందే. భార్యను హత్య చేయడానికి అతను ముందస్తు ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ‘మడత చాకు’ను అంతర్జాలంలో ఆర్డర్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు సమాచారం. 5 రోజుల ముందే దాన్ని ఆర్డర్‌ చేయగా హత్య జరగడానికి ముందురోజు అది డెలివరీ అయినట్లుగా పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. చరవాణి అంత పొడవుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. దానితోనే సుధారాణి గొంతు కోసి తానూ గాయపరుచుకుని ఉంటాడని భావిస్తున్నారు. భార్యను హత్య చేశాక మృతురాలి బంధువులు తనను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయని భావించిన అతను కావాలనే అదే చాకుతో గాయపరుచుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనికి ప్రాణాపాయం తప్పినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గొంతుకు అంగుళం లోతులో చర్మం తెగిందని వైద్యులు చెబుతున్నారు. ఆ కారణంగా సరిగా మాట్లాడలేకపోతున్నాడని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని