Crime News: అలారం మోగినా వినిపిస్తేనా.. చోరీకి పాల్పడుతూ చిక్కిన వ్యక్తి

అతని పేరు డిలోడ్‌ సునీల్‌.  మాటలు రావు.. చెవులు వినబడవు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేస్తున్న అతడు సునీల్‌ ఏకంగా స్థానిక పద్మనగర్‌ రహదారిపై

Updated : 29 Nov 2021 06:51 IST

ఏటీఎంలో చోరీకి యత్నిస్తున్న సునీల్‌

తని పేరు డిలోడ్‌ సునీల్‌.  మాటలు రావు.. చెవులు వినబడవు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేస్తున్న అతడు సునీల్‌ ఏకంగా స్థానిక పద్మనగర్‌ రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించాడు. ఇనుపరాడ్డుతో యంత్రాన్ని ధ్వంసం చేశాడు. వెంటనే అలారం మోగింది. కానీ వినికిడి సమస్య వల్ల అతడికి ఆ శబ్దం వినిపించలేదు. అక్కడే ఉండి డబ్బు తీసే పనిలో ఉండిపోయాడు. శబ్దం విన్న స్థానికులు మేల్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కూడా అతడు చోరీ పనిలోనే తలమునకలై ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.  

-న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవార్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని