
Updated : 09 Nov 2021 16:42 IST
TS News: పెళ్లి పేరుతో 19 మంది మహిళలకు మోసం..
గుండెపోటంటూ ఆస్పత్రిలో చేరిక
నల్గొండ: పెళ్లి పేరుతో నల్గొండలో మహిళలను మోసం చేసిన విలియమ్స్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానికంగా ఉండే ఓ చర్చిలో పియానో వాయించే ఇతను పలువురు మహిళలను మోసం చేసినట్లు తెలుస్తోంది. చర్చికి వచ్చే యువతులు, మహిళలను విలియమ్స్ లోబరుచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి భార్య పోలీసులను ఆశ్రయించడంతో విలియమ్స్ బాగోతం వెలుగులోకి వచ్చింది. 19 మంది మహిళలను మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. కాగా తనకు గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్ ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
Tags :