
Crime News: తువ్వాలు ఆలస్యంగా ఇచ్చినందుకు భార్యనే చంపేశాడు
బాలాఘాట్: అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా హీరాపుర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ బాహేగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్నానం ముగించుకున్న రాజ్‌కుమార్.. భార్య పుష్పా బాయ్ (45)ను తువ్వాలు అడిగాడు. ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని, కాసేపు ఆగాలని ఆమె చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత తువ్వాలు అందించింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న రాజ్‌కుమార్.. అక్కడే ఉన్న పారతో భార్య తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుమార్తెను బెదిరించాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన పుష్ప అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.