Crime News: ఉన్నత కుటుంబంలో పుట్టినా.. దొంగతనాల్లో సెంచరీ కొట్టాడు

తండ్రి పోలీసు శాఖలో ఏసీపీగా ఉద్యోగ విరమణ పొందారు... భార్య, సోదరీలు న్యాయవాదులు.. సోదరులు విదేశాల్లో స్థిరపడ్డారు.. అతను మాత్రం జల్సాల

Updated : 08 Sep 2021 10:02 IST

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: తండ్రి పోలీసు శాఖలో ఏసీపీగా ఉద్యోగ విరమణ పొందారు... భార్య, సోదరీలు న్యాయవాదులు.. సోదరులు విదేశాల్లో స్థిరపడ్డారు.. అతను మాత్రం జల్సాల మోజులో దొంగతనాలకు పాల్పడుతూ చోరీల్లో సెంచరీ దాటేశాడు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 100కుపైగా దొంగతనాలకు పాల్పడి ఆ తరువాత జిల్లాల బాట పట్టాడు.  కేవలం సంపన్నుల ఇళ్లను కొల్లగొట్టడం, చోరీ సొత్తును ఫుత్‌పాత్‌పై నివసించే వ్యక్తులు, భిక్షాటన చేసే వారికి పంచిపెట్టడం.. ఇతడి ప్రత్యేకత.  హకీంపేట పారామౌంట్‌ కాలనీకి చెందిన నిందితుడు మీర్‌ ఖాజమ్‌ అలీఖాన్‌(27)పై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి మే నెలలో విడుదలైన మీర్‌ ఖాజమ్‌ అలీఖాన్‌ మళ్లీ చోరీల బాటనే ఎంచుకున్నాడు. ఆగస్టు 27న జహీరాబాద్‌ పట్టణంలో దొంగతనం చేసి ముంబయిలో విక్రయించేందుకు వెళ్తుండగా టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాల్లో గుర్తించి జహీరాబాద్‌లోని బీదర్‌ చౌరస్తాలో పట్టుకున్నారు. ఇంటికి ఏసీలు అమర్చి ఉండటం, ముంగిట్లో కార్లు, సుందరమైన ప్రాంగణాలు కన్పించే ఇళ్లలోనే మీర్‌ ఖాజమ్‌ అలీఖాన్‌ చోరీకి పాల్పడేవాడు. 18 ఏళ్ల వయస్సులో మొదలు పెట్టిన నేరాలు చిట్టా... ఇప్పటికి సుమారు 140 చోరీల వరకు ఉంటాయి. 2018లో కొండాపూర్‌లో చోరీకి పాల్పడగా  పీడీ యాక్టు నమోదైంది. నార్సింగిలోనూ ఇదే తరహా చోరీ చేయడంతో రెండోసారీ పీడీ యాక్టు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని