Crime News: మానవబాంబై భార్యను చంపేసిన భర్త

మానవబాంబుగా మారి ఓ భర్త తన భార్యపై కక్ష తీర్చుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ మరణించారు. మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో ఈ అసాధారణ సంఘటన

Updated : 07 Oct 2021 06:55 IST

పేలుడులో అతనూ దుర్మరణం

విస్ఫోటం జరిగిన మార్కెట్‌ ప్రాంతం

ఆయిజోల్‌: మానవబాంబుగా మారి ఓ భర్త తన భార్యపై కక్ష తీర్చుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ మరణించారు. మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో ఈ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఛన్మరి ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్లో ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) కూరగాయలు విక్రయించేది. మంగళవారం ఆమె వద్దకు వచ్చిన భర్త సి.రోహ్మింగ్లియానా (62) ఏదో మాట్లాడుతున్నట్లు నటించి, అమాంతం కౌగిలించుకున్నాడు. దుస్తుల లోపల జిలెటిన్‌ స్టిక్స్‌ చుట్టుకొని వచ్చిన అతడు ట్రిగ్గర్‌ నొక్కగానే భారీ పేలుడుతో మార్కెట్‌ దద్ధరిల్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ లుంగ్‌లేయీ సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ సంఘటనలో మరెవరూ గాయపడలేదని తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఇలా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పేలుడు జరిగిన సమయంలో ట్లాంగ్థియాన్‌ఘ్లిమి కుమార్తె తల్లికి కొద్దిదూరంలోనే ఉంది. స్థిరమైన ఉపాధి లేని రోహ్మింగ్లియానా భార్యను తరచూ వేధించేవాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని