
Suicide: పండక్కి కొడుకు రాలేదని తల్లి ఆత్మహత్య
అమీర్‌పేట, న్యూస్‌టుడే: దీపావళికి కుమారుడు, కోడలు ఇంటికి రాలేదనే మనస్తాపంతో తల్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సార్‌నగర్ సీఐ సైదులు వివరాల ప్రకారం.. మోడల్‌కాలనీకి చెందిన దండ బుచ్చిబాబు, సుజాత(53) కుమారుడు యోగకు గత ఆగస్టులో వివాహమైంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన కుమారుడు, కోడలు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. దీపావళికి రావాలని సుజాత కోరగా సెలవు లేక వారు రాలేదు. మనస్తాపానికి గురైన ఆమె అప్పట్నుంచి ముభావంగా ఉంటోంది. గురువారం తెల్లవారుజామున భర్త పెంట్‌హౌస్‌లో నిద్రపోగా.. సుజాత కింది అంతస్తులో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.