Viveka murder case: వివేకా హత్యకేసులో మరో నిందితుడు అరెస్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్టు చేశారు. సింహాద్రిపురం

Updated : 09 Sep 2021 19:43 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసులో సీబీఐ అధికారులు ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్టు చేశారు. సింహాద్రిపురం మండలం కుంచేకులవాసి ఉమాశంకర్‌రెడ్డిని ఉదయం నుంచి విచారించిన అధికారులు సాయంత్రం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి అని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈకేసులో ఇప్పటికే సునీల్‌ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈనెల 23వరకు రిమాండ్‌ విధించింది. దీంతో అతన్ని పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు