
Updated : 09 Sep 2021 18:45 IST
Crime News: నల్గొండ జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు
నేరేడుచర్ల: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నేరేడుచర్ల మండలం రాజీవ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువతిపై బాలసైదులు అనే యువకుడు బ్లేడ్లతో దాడి చేసి గొంతు కోశాడు. తరచుగా ప్రేమిస్తున్నానని అమ్మాయిని వేదిస్తున్న యువకుడు.. ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని తెలుసుకొని దాడికి పాల్పడ్డాడు. ఒంటరిగా వెళ్తున్న యువతిపై బాలసైదులు బ్లేడ్లతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. యువతి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :