AP News: నోట్లో డీజిల్‌.. వికటించిన విన్యాసం.. 

విశాఖ జిల్లా ఎలిమంచిలి పరిధిలోని పాత వీధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగుల చవితి వేడుకల సందర్భంగా చేసిన విన్యాసం వికటించింది.

Updated : 10 Nov 2021 12:28 IST

ఎలమంచిలి: విశాఖ జిల్లా ఎలిమంచిలి పరిధిలోని పాత వీధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. నాగుల చవితి వేడుకల సందర్భంగా చేసిన విన్యాసం వికటించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగుల చవితి నాడు సంతోష్‌ అనే వ్యక్తి నోట్లో డీజిల్‌ పోసుకుని విన్యాసం చేస్తుండగా అతడికి మంటలు అంటుకున్నాయి. 

వెంటనే మంటలు ఆర్పేందుకు అక్కడున్న వారు ప్రయత్నించే క్రమంలో సంతోష్‌ చేతిలోని డీజిల్‌ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో సంతోష్‌ ముఖం, ఛాతి భాగాలకు మంటలు అంటుకున్నాయి. అక్కడున్న మరికొంత మంది సత్వరమే స్పందించి నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. అప్పటికే సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. బాధితుడిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని